మానస సరోవరంలో చిక్కుకొన్న 40 మంది హైద్రాబాదీలు (వీడియో)

Published : Jun 24, 2019, 04:10 PM ISTUpdated : Jun 24, 2019, 04:33 PM IST
మానస సరోవరంలో చిక్కుకొన్న 40 మంది హైద్రాబాదీలు (వీడియో)

సారాంశం

నేపాల్, చైనా సరిహద్దుల్లో  హైద్రాబాద్ కు చెందిన  40 మంది యాత్రికులు చిక్కుకొన్నారు.  

దరాబాద్:  నేపాల్, చైనా సరిహద్దుల్లో  హైద్రాబాద్ కు చెందిన  40 మంది యాత్రికులు చిక్కుకొన్నారు.ఐదు రోజులుగా మానస సరోవరం ప్రాంతంలోనే వీరంతా చిక్కుకొన్నట్టుగా బాధితులు తమ కుటుంబసభ్యులకు ఫోన్‌లో వీడియోలను పంపారు.ఈ నెల 13వ తేదీన మానస సరోవ యాత్రకు40 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లారు.

అయితే యాత్రికులను  ఆ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని  బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారంతా  వీడియో రూపంలో  కుటుంబసభ్యులకు షేర్ చేశారు.

తమను కాపాడాలని  బాధితులు వేడుకొంటున్నారు. అయితే యాత్రికులు ఐదు రోజులుగా ఎందుకు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్