మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు క్యాబినెట్ హోదా

Published : Aug 14, 2021, 03:23 PM IST
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు క్యాబినెట్ హోదా

సారాంశం

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఆయనను నియమించి నెల కూడా తిరగకముందే మరో పదవిని కట్టబెట్టింది.

హైదరాబాద్: మానకొండూర్ శాసనసభ్యులు, ప్రజాగాయకులు రసమయి బాలకిషన్2కు మరో కీలక పదవి లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మంత్రివర్గ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఇటీవలే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. నెల తిరుగకముందే ఆయనకు క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజరాబాద్ ఉపఎన్నిక కాక పెరుగుతున్న తరుణంలో టీఆరఎస్ ప్రభుత్వ ఉమ్మడి కరీనంగర్‌పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఇప్పటికే గంగుల కమలాకర్ పలుసార్లు దూకుడుగా కామెంట్లు చేసిస విషయం విదితమే.

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?