మంచిర్యాల జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌లో యువకుడు మృతి.. అసలేం జరిగింది..?

By Sumanth Kanukula  |  First Published Aug 28, 2023, 9:46 AM IST

మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు పోలీసు స్టేషన్‌లోనే కుప్పకూలి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.


మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు పోలీసు స్టేషన్‌లోనే కుప్పకూలి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. గుండెపోటు లేదా ఫిట్స్ కారణంగా యువకుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. బెల్లంపల్లికి చెందిన అంజి అనే యువకుడిపై లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ క్రమంలోనే అంజిని తాళ్లగుర్జాల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే పోలీసు స్టేషన్ హాల్‌లో కూర్చున్న అంజి కొద్దిసేపు ఫోన్‌ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అక్కడి కానిస్టేబుల్ ఒక్కరు వెంటనే.. అంజిని తట్టిలేపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అంజి మృతిచెందాడు. దీంతో అంజి కుటుంబంలో విషాదం నెలకొంది. 

Latest Videos

అంజిది లాకప్‌ డెత్‌ కాదని పోలీసులు చెబుతున్నారు. అంజిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించామని.. అయితే విచారించక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇక, అంజి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.


 

click me!