హైదరాబాద్ మెట్రో రైలు ట్రాక్‌పై యువకుడి హల్‌చల్..

Published : May 02, 2022, 12:34 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు ట్రాక్‌పై యువకుడి హల్‌చల్..

సారాంశం

హైదరాబాద్ మెట్రో రైలు ట్రాక్‌పై ఓ యువకుడు హల్ చల్ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి మెట్రో రైల్వే ట్రాక్‌ కనిపించడంతో  అధికారులు,  సిబ్బంది ఆందోళన చెందారు. 

హైదరాబాద్ మెట్రో రైలు ట్రాక్‌పై ఓ యువకుడు హల్ చల్ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి మెట్రో రైల్వే ట్రాక్‌ కనిపించడంతో  అధికారులు,  సిబ్బంది ఆందోళన చెందారు.  ఓ వ్యక్తి సికింద్రాబాద్‌ వెస్ట్‌-జేబీఎస్‌ మార్గంలో రైల్వే ట్రాక్‌పై ఉన్నట్టుగా మెట్రో భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గంటపాటు ఒకే ట్రాక్‌పై మెట్రో సర్వీసులను నడిపారు. 

మరోవైపు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి అధికారులు, సిబ్బంది ప్రయత్నించారు. అయితే ట్రాక్ వద్ద జాలి పక్కన దాక్కున్న అతడు అధికారులను టెన్షన్ పెట్టించాడు. అతికష్టం మీద మెట్రో సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు టెన్షన్ పడ్డారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకన్న తర్వాత ఆ మార్గంలో యథావిథిగా మెట్రో రైళ్లను నడిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?