
నల్గొండ : Witchcraft చేసి ఓ మహిళ మృతికి కారణమయ్యావని, జరిమానా విదిస్తామని కొందరు గ్రామస్తులు బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరం చెందారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అమానవీయ ఘటన
Nalgonda District దేవరకొండ మండలం వైదోనివంపు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైదోనివంపులో నెల రోజుల క్రితం ఓ మహిళ మృతి చెందింది. తేరటి అంజయ్య (54)తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు చేసిన చేతబడే ఆమె మరణానికి కారణమని గ్రామస్తులు భావించారు.
శుక్రవారం ముగ్గురినీ రచ్చబండ వద్దకు పిలవాలని గ్రామ పెద్దలు నిర్ణయించగా, అంజయ్య అందుబాటులోకి రాలేదు. అక్కడికి వచ్చిన మిగతా ఇద్దరు వ్యక్తులను చితకబాది. ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున జరిమానా విధించారు. ‘నువ్వు సైతం జరిమానా కట్టాల్సిందే’ అని హెచ్చరిస్తూ అంజయ్యకు గ్రామ పెద్దలు సమాచారం పంపారు. తన మీద అకారణంగా నిందలు మోపారని, జరిమానా కట్టలేనని ఆందోళన చెంది తీవ్ర మనస్తాపానికి గురైన అంజయ్య... అదే రోజు రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. దీనిమీద పోలీసులకు సమాచారం అందడతో ఆదివారం రాత్రి ఎస్సై గోపీకృష్ణ సిబ్బందితో కలిసి ఆ గ్రామానికి వెళ్లగా.. తమ కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ బాదిత కుటుంబం బోరున విలపించింది. అంజయ్య మృతి మీద విచారణ పరారంభించామని ఎస్సై చెప్పారు.
ఇదిలా ఉండగా, మార్చి 16న ఇలాంటి ఘటనే విజయనగరంలో జరిగింది. ఈ యేడాది జనవరి 10న అర్థరాత్రి దాటిన తరువాత తెర్లాం మండలంలోని రాజయ్యపేటలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ (67) సజీవ దహనమయ్యింది. ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్థారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా ఆ విషయం మరిచిపోయారు.
సరిగా రెండు నెలలకు... గౌరమ్మ ప్రమాదవశాత్తు కాలిపోలేదని, తానే హత్య చేస చంపేశానంటూ అదే గ్రామాని చెందిన ఆర్. సింహాచలం అనే యువకుడు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం చర్చనీయాంశమయ్యింది. దీనికి సంబంధించి బొబ్బలి సీఐ శోభన్ బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడు విచారించారు. ఈ సమయంలో సింహాచలం చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘నాలుగేళ్ల క్రితం నా భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడ చేయడంతో అనారోగ్యం పాలయ్యారు. దీంతో భార్య పిల్లలతో సహా తన ఇంటికి వెళ్లిపోయింది. నిరుడు దసరాకు ముందు నా తండ్రికి చేతబడ చేయడంతో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గౌరమ్మను ఎలాగైనా చంపాలనుకున్నా.. పగలే హత్య చేసి పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నా. జనవరి 10న ఓ ఇంటి నుంచి గొడ్డలి, పెట్రోల్ తీసుకుని అర్థరాత్రి దాటిన తరువాత గౌరమ్మ ఇంటికి వెళ్లా. నిద్రిస్తున్న ఆమె మెడ మీద గొడ్డలి తిరగేసి రెండుసార్లు బలంగా కొట్టాను. ఇంకా బతికే ఉందేమోనన్న అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. చేతబడి చేసిందని తప్ప వేరే ఉద్దేశంతో చేయలేదని నిందితుడు తెలిపాడు.
ఎందుకు లొంగిపోయాడంటే....
ఈనెల 13న అర్థరాత్రి గ్రామంలోని పాతినవలస కనకరాజుకు చెందిన పశువుల శాల కాలిపోయింది. ఆ సమయంలో సింహాచలం అటుగా వెళ్లడం గమనించిన బాధితులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీశారు. పశులక శాలను తాను కాల్చలేదని, గౌరమ్మను కాల్చానని చెప్పడంతో అందరూ భయంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడే తప్పు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం బొబ్బిలి ఏజేఎఫ్ సీఎం కోర్టుకు తరలించినట్లు సీఐ శోభన్ బాబు చెప్పారు.