వరంగల్ జిల్లాలో యువతి గొంతును కోశాడు ఓ వ్యక్తి. నిందితుడు జడ్జి ముందు లొంగిపోయాడు.
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలోని రాంనగర్‌లో షాహీద్ అనే వ్యక్తి హరతి అనే యువతి గొంతును కోశాడు. ఆ తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు.
Also read;మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?
హన్మకొండ రాంగ్‌నగర్ లో హరతి అనే యువతి గొంతును షాహిద్ కోసినట్టుగా స్థానికులు చెప్పారు. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
నిందితుడు జడ్జి ఎదుట షాహీద్ లొంగిపోయాడు. జడ్జి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. హరతి, షాహీద్ కొంత కాలంగా అదే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు.
Also Read:మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్
మూడు నాలుగు మాసాలుగా హరతిపై అనుమానం పెంచుకొన్నాడు. ఈ క్రమంలోనే నిత్యం షాహీద్ హరతిని వేధింపులకు గురి చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు.
ఇవాళ కూడ వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా స్తఝానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బ్లేడుతో షాహీద్ హరతి మెడపై కోశాడు.