వీళ్లు మనుషులేనా: నిండు గోదారిలో పడవకి తాళ్లతో పశువులను కట్టి (వీడియో)

By Siva KodatiFirst Published Apr 3, 2021, 7:43 PM IST
Highlights

పెద్దపల్లి గోదావరి ఫెర్రీ పాయింట్ లో నిర్వాహకుల పైశాచికత్వానికి అంతే లేకుండా పోతోంది. మూగజీవాలను కబేళారాలకు తరలించే క్రమంలో ఏమాత్రం జాలి లేకుండా వాటిని పడవకు కట్టి లాక్కెళ్తున్నారు. 

పెద్దపల్లి గోదావరి ఫెర్రీ పాయింట్ లో నిర్వాహకుల పైశాచికత్వానికి అంతే లేకుండా పోతోంది. మూగజీవాలను కబేళారాలకు తరలించే క్రమంలో ఏమాత్రం జాలి లేకుండా వాటిని పడవకు కట్టి లాక్కెళ్తున్నారు.

వివరాల్లోకి వెళితే పెద్దిపల్లి గోదావరి పెర్రి పాయింట్ వద్ద మర్చి 30వ తేదీన జరిగిన వేలం పాటలో గోదావరి పెర్రీ పాయింట్ దక్కించుకున్న నిర్వాహకులు కాక గిరిజనేతర వ్యక్తి పడవ ద్వారా మనుషులను దాటిస్తున్నాడు.

అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అక్రమంగా పశువులను పడవకు ఇరువైపులా తాళ్లతో మెడకు కట్టి సుమారు నలభై పశువులను పడవలో తీసుకు వెళ్తుండటాన్ని మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు.

గిరిజనేతర(నిర్వాహకులు ) వ్యక్తి తాము ఏమి చేసినా అడిగేవారు లేరంటూ, మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ సమాధానం ఇవ్వడంతో విలేఖరులు సైతం ఖంగుతిన్నారు.

ఇలా ప్రతిరోజు వందలాదిగా మూగజీవాలను పడవకు కట్టిపడేసి తీసుకు వెళ్తున్నట్టు పలువురు  తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూగజీవాలను హింసిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

 

"

click me!