ప్రేమించాలంటూ యువతితో అసభ్యచేష్టలు.. అడ్డొచ్చిన సెక్యూరిటీని కొట్టి..

Published : Jun 10, 2021, 09:56 AM IST
ప్రేమించాలంటూ యువతితో అసభ్యచేష్టలు.. అడ్డొచ్చిన సెక్యూరిటీని కొట్టి..

సారాంశం

ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి అల్లరి చేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం...

బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న యువతి (26) ఫోన్ కు అరవింద్ అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నంటూ చెప్పడంతో అందుకు ఆమె నిరాకరించారు. 

అతను పదే పదే ఫోన్ చేసి ఆమెను వేధించడం ప్రారంభించాడు. రాచకొండ పరిధిలో ఉండే ఆమెను అనుసరించడంతో పాటు గత నెల 31న ఆసుపత్రి ముందుకు వచ్చి వేచి ఉన్నాడు. ఆసుపత్రికి యువతిని రాగానే అతను వెళ్లి ఒక్కసారిగా చేయి పట్టుకున్నాడు. 

ప్రేమను అంగీకరించాలని అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు అక్కడికి చేరుకుని నిలువరించేందుకు ప్రయత్నించగా అరవింద్ అతడిని సైతం బెదిరించాడు.

అప్పటినుంచి ఆమె విధులకు దూరంగా ఉంది. ఆసుపత్రి ఉద్యోగుల సహకారంతో ధైర్యం చేసుకుని వచ్చిన ఆమె జరిగిన ఘటనమీద బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం రాత్రి అరవింద్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?