చెట్టుపైనే డెడ్‌బాడీ:భార్యను చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

Published : Jun 10, 2021, 09:23 AM ISTUpdated : Jun 10, 2021, 10:43 AM IST
చెట్టుపైనే డెడ్‌బాడీ:భార్యను చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

సారాంశం

నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ యువకుడి ప్రాణాలు తీశాడు కారు డ్రైవర్ పై  బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆదిలాబాద్: నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ యువకుడి ప్రాణాలు తీశాడు కారు డ్రైవర్ పై  బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఊ)ట్నూరు మండలం నీలగొండికి చెందిన సోయం మాన్కు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య జంగుబాయికి కాలు విరిగింది. దీంతో ఆమె పుట్టింట్లో ఉంది. ఆమెను చూసేందుకు నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చెన్ ఎల్లాపూర్‌కు మాన్కు బయలుదేరాడు. దోస్త్‌నగర్  సమీపంలో అటవీ ప్రాంతానికి రాగానే నిర్మల్ నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు రాంగ్‌ రూట్‌లో వచ్చి బైకును ఢీకొట్టింది. 

అతివేగంగా రాంగ్ రూట్‌లో  కారును నడపడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకొందని  పోలీసులు తెలిపారు.  కారు ఢీకొట్టిన వేగానికి బైక్ పై నుండి 13 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుపై పడ్డాడు మాన్కు.  చెట్టు కొమ్మకు ఆయన  షర్ట్ చిక్కుకొంది. దీంతో చెట్టుకొమ్మపైనే మృతదేహం వేలాడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెట్టుపై నుండి మృతదేహాన్ని తీసి పంచనామా నిర్వహించారు.

మాన్కు చాతీ, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన చెట్టుపైనే మరణించాడు. బైక్ పూర్తిగా దెబ్బతింది. కారు కూడ నుజ్జునుజ్జయింది. కారు నడిపిన వ్యక్తి కాలుకు గాయమైంది.  మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం