మనవరాలిపై అత్యాచారం.. బాలిక గర్భం దాల్చడంతో..

Published : May 09, 2019, 09:39 AM IST
మనవరాలిపై అత్యాచారం.. బాలిక గర్భం దాల్చడంతో..

సారాంశం

బంధువు అని ఇంట్లో చోటిస్తే... దుర్భుద్ధి చూపించాడు. మనవరాలి వరసయ్యే బాలికపై వరుస అత్యాచారాలకు పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. గర్భం దాల్చిన ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మీర్‌పేటలో ఈ ఘటన జరిగింది. 

బంధువు అని ఇంట్లో చోటిస్తే... దుర్భుద్ధి చూపించాడు. మనవరాలి వరసయ్యే బాలికపై వరుస అత్యాచారాలకు పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. గర్భం దాల్చిన ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మీర్‌పేటలో ఈ ఘటన జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...నల్లగొండలోని ప్రియదర్శిని కాలనీకి చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మీర్‌పేటలో ఉంటున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. భార్య చనిపోగా, అదే ప్రాంతానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. 

రెండో భార్య కి ఓ మేనమామ ఉండేవాడు. తరచూ వీళ్ల ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో  ఈ క్రమంలో అతడు తన కోడలు సవతి రెండో కూతురు (17)కు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఇటీవల బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా 7నెలల గర్భిణి అని తేలింది.
 
దాంతో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. పదిహేను రోజుల క్రితం ఆమె తండ్రి తన సొంతూరులో పంచాయితీ పెట్టగా పెద్దలు నిందితుడికి రూ.లక్షన్నర జరిమానా విధించారు. ఆ సొమ్మును బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిందిగా తీర్పు చెప్పారు. ఇందుకు నిందితుడు ఒప్పుకొన్నాడు. మంగళవారం రూ.50 వేలు ఇస్తానని చెప్పడంతో వారు సొంతూరికి వెళ్లారు. 

అదేరోజు సాయంత్రం బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. తన కూతురును తన రెండో భార్య మేనమామ చంపేశారంటూ మృతురాలి తండ్రి ఆరోపించాడు. డబ్బు మిగిల్చుకోవాలనే దురాలోచనతోనే పథకం ప్రకారం చంపారని వాపోయాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?