జగిత్యాల: అనుమానం పెనుభూతమై... భార్యను చంపి ఆ వెంటనే ఉరేసుకున్న భర్త (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 10, 2021, 04:21 PM ISTUpdated : Sep 10, 2021, 05:24 PM IST
జగిత్యాల: అనుమానం పెనుభూతమై... భార్యను చంపి ఆ వెంటనే ఉరేసుకున్న భర్త (వీడియో)

సారాంశం

కుటుంబ కలహాల కారణంగా భార్యను హతమార్చిన భర్త చివరకు పశ్చాత్తాపంతో తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.  

వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య, ప్రమీల దంపతులు. దేవయ్య దుబాయ్ వెళ్లి సంవత్సరం క్రితం ఇంటికి రాగా అప్పటి నుండి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చెలరేగి కొంతకాలంగా నిత్యం గొడవలు జరుగుతుండేవి. 

వీడియో

ఇలా గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన దేవయ్య క్షణికావేశంలో కర్రతో భార్య ప్రమీలపై దాడిచేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావమై ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది.  

read more  హైదరాబాదులో దారుణం: పాపపై లైంగిక దాడి చేసి, చంపేసి, బొంతలో శవాన్ని చుట్టి....

అయితే భార్యను చంపిన బాధను భరించలేక దేవయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను చంపిన వెంటనే అతడు కూడా ఉరేసుకున్నాడు. భార్యభర్తల మృతదేహాలను గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.  

 ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే