తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా కేవలం 384 పాజిటివ్ కేసులే నమోదు

Arun Kumar P   | Asianet News
Published : Dec 14, 2020, 09:27 AM ISTUpdated : Dec 14, 2020, 09:41 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా కేవలం 384 పాజిటివ్ కేసులే నమోదు

సారాంశం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది.  

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) 28,980మందికి టెస్టులు చేయగా కేవలం 384మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 61,57,683కు చేరగా మొత్తం కేసుల సంఖ్య 2,78,108కు చేరింది.  

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 631 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,69,232కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7,380 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  ముగ్గురు మాత్రమే మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1496కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.80శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే  జోగులాంబ గద్వాల జిల్లాలో కేసులేవి నమోదుకాలేదు. అలాగే ఆదిలాబాద్ 6, కామారెడ్డి 2, నారాయణ పేట 2, భూపాలపల్లి 9, జనగామ 5, జగిత్యాల 8, వనపర్తి 1, అసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 5, మహబూబాబాద్ 6, మెదక్ 5, నాగర్ కర్నూల్ 8,  నిర్మల్ 4, నిజామాబాద్ 8,  సిరిసిల్ల 8, వికారాబాద్ 9, వరంగల్ రూరల్ 7, ఆదిలాబాద్ 6, కొత్తగూడెం 7, ములుగు 6, పెద్దపల్లి 7, సిద్దిపేట 7,సూర్యాపేట 8, భువనగిరి 1, మంచిర్యాల 9, నల్గొండ 7 అతి తక్కువ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 101కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 31, రంగారెడ్డి 36, కరీంనగర్ 16, ఖమ్మం 13,   సంగారెడ్డి 14,  వరంగల్ అర్బన్ 25 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu