
అతనికి అప్పటికే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కూతురి వయసుకంటే చిన్నదైన మూడేళ్ల చిన్నారిపై అతని కన్ను పడింది. పసిపిల్ల అనే కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరమగ్గాలతో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. అతని వయసు 30 కాగా... భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా... ఇటీవల భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి శుభకార్యానికి వెళ్లింది. అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. అదే ప్రాంతానికి చెందిన ఓ మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అతని కంట పడింది.
వెంటనే చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి.. ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ బయటకు రావడాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. దీంతో.. విషయం అర్థమైన చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా... అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు కూడా తాను చేసిన నేరాన్ని అంగీకరించిటనట్లు పోలీసులు చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.