కారణమిదీ:హైద్రాబాద్‌లో మళ్లీ పెరిగిన చికెన్ ధరలు

By narsimha lodeFirst Published Apr 4, 2021, 5:45 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో చికెన్ ధరలు పెరిగాయి. ఆదివారం నాడు కిలో చికెన్ ధర రూ. 260కి చేరుకొంది. రెండు రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర రూ. 230గా ఉండేది.


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో చికెన్ ధరలు పెరిగాయి. ఆదివారం నాడు కిలో చికెన్ ధర రూ. 260కి చేరుకొంది. రెండు రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర రూ. 230గా ఉండేది.కరోనాతో పాటు బర్డ్‌ఫ్లూ కారణంగా  గత ఏడాది చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఉచితంగా చికెన్, గుడ్లను ఇచ్చినా కూడ జనం తీసుకోవడానికి భయపడ్డారు.

కానీ, కరోనా నివారణలో చికెన్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు సూచించడంతో చికెన్ విక్రయాలు పెరిగాయి. గతంలో బర్డ్‌ఫ్లూతో పాటు చికెన్ విక్రయాలు తక్కువగా ఉన్న కారణంగా కోళ్ల పెంపకంపై రైతులు నిరాసక్తతను చూపారు. ఆ తర్వాత చికెన్ విక్రయాలు పెరగడంతో మళ్లీ కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపారు.

నాలుగు నెలల క్రితం వరకు కిలో చికెన్ ధర రూ. 90 గా ఉంది. ఆ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో చికెన్ ధర కిలో  రూ. 200లకు చేరుకొంది.ఇవాళ ఆదివారం నాడు కావడంతో చికెన్ ధర రూ. 260కి చేరింది.రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగింది. దీంతో కోళ్ల  ఉత్పత్తి కూడ తగ్గిపోయింది. వేసవిలో సాధారణంగా చికెన్ ధరలు పెరగడం సాధారణమేనని వ్యాపారులు చెబుతున్నారు.

click me!