బంధువుల ఇంటికి వచ్చి.. అద్దెకున్న బాలికపై అత్యాచారం.. నిద్రమాత్రలు మింగడంతో..

By SumaBala Bukka  |  First Published Oct 20, 2022, 6:39 AM IST

బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన ఓ వ్యక్తి అద్దెకున్న మైనర్ అమ్మాయిపై కన్నేశాడు. బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 


ఖమ్మం : బంధువుల ఇంటికి వచ్చిన ఓ యువకుడు చూసి వెళ్లకుండా.. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరవాత ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక కుంగిపోయిన ఆ బాలికపై మరో సారి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీన్ని తట్టుకోలేక  ఆ బాలిక నిద్రమాత్రలు మింగింది. అలా విషయం వెలుగులోకి వచ్చింది.  దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఖమ్మంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగరంలో ఓ 17 ఏళ్ల బాలిక చదువుతోంది.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కొత్త పోచారానికి చెందిన మంచ్యాల హరీశ్ కుటుంబం ఖమ్మంలోని జడ్పీ సెంటర్ లో గత ఏడేళ్లుగా నివాసముంటుంది. జూలై 26న హరీష్ తన బంధువుల ఇంటికి వచ్చాడు. అదే ఇంట్లో పని అంతస్తులు అద్దెకుంటున్న బాలికను చూసి ఆమె మీద కన్నేశాడు. ఎవరూ చూడని సమయంలో బాలికను బంధువుల ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Latest Videos

మునుగోడు ఉపఎన్నిక ... రోడ్డు రోలర్ గుర్తుపై లొల్లి, హైదరాబాద్‌‌కు డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్

ఈనెల 16న నర్సింగ్ శిక్షణకు పెడుతున్న బాలిక వెంట పడ్డాడు.  దీంతో బాలిక ఇంటికి పరిగెత్తింది. దీంతో బాలిక వెంట ఇంటి వరకు వచ్చాడు. ఇంట్లోకి వెళ్లబోగా బాలిక తలుపు వేసుకుంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్పృహ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో వారు బుధవారం రెండో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీధర్ నిందితుడు హరీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది. బధిర బాలికపై ఒక మేజర్, ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నల్లజర్లలో జరిగింది. కొవ్వూరు డిఎస్సి శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లని రాజమహేంద్రవరం జిల్లా.. నల్లజర్ల మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక (15)కు చెవుడు, మూగ. ఏలూరులోని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో చదువుతూ దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్ళగా..  బాలిక ఇంట్లో నిద్రిస్తోంది. 

అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు, ద్వారకాతిరుమల మండలం రామశింగవరానికి చెందిన రాసమర్తి దుర్గాంజనేయులు సోమవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడ్డారు. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం బాలికను ఏలూరు హాస్టల్ కి తీసుకెళ్తామని త్వరగా వచ్చిన తండ్రిని చూసి నిందితులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

click me!