ఈ నెల 21న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కాళేశ్వరంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకేనా..?

By Sumanth KanukulaFirst Published Oct 19, 2022, 5:10 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లి సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 21న ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా కేంద్ర జలశక్తిని శాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇక, ఇటీవల ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల.. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు భారీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించాలని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ డైరెక్టర్ డీఐజీ ర్యాంక్ అధికారివిచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే సకాలంలో చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. 1.2 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లు కేంద్ర ఆర్థిక సంస్థల నిధులేనని షర్మిల అన్నారు. 

click me!