చాక్లెట్ కొనిస్తానని ఆశపెట్టి ఓ చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ములుగు జిల్లా : కామాంధులు చిన్నారులనూ వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు ఏదో ఒక వంకతో మాయమాటలు చెప్పి.. వారిమీద అత్యాచారినికి తెగబడుతున్నారు. అలా ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు molestationకి ఒడిగట్టిన సంఘటన తెలంగాణ రాష్ట్రం, Mulugu district ఏటూరునాగారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… సోమవారం మధ్యాహ్నం తన ఇంటికి సమీపంలో స్నేహితులతో ఆడుకుంటున్న girlను ప్రవీణ్ కుమార్ (25) అనే యువకుడు Chocolate ఇస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు.
గ్రామ శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో షాక్ కు గురైన బాలిక.. ఏడుస్తూ ఇంటికి చేరింది. ఏం జరిగిందని అడిగిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. పోలీసుల నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక ఎస్సై రమేష్ ను అడిగితే.. అలాంటి ఘటన ఏది తమ దృష్టికి రాలేదని తెలిపారు.
మరో ఘటనలో..
ఇలాంటి ఘటనే నిరుడు జైపూర్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్ లో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడో కామాంధుడు. ఇరుగు పొరుగు వారు గమనించడంతో ఆ చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడింది. Jaipur లోని ఓ కాలనీలో ఓ 9 ఏళ్ళ పాప బయట ఒంటరిగా ఆడుకుంటుంది. ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఆ తరువాత కాసేపటికి కాలనీలోని ఒక ఇంట్లో నుంచి పాప గట్టిగా Screaming వినిపించింది.
ఆ కేకలు విన్న ఇరుగుపొరుగువారు వెళ్లి చూడగా.. వీరిని చూసి ఆ ఇంటి యజమాని పరుగులు తీశాడు..తీరా లోపలికి వెళ్లి చూసేసరికి పాప Half nakedగా ఉంది. ఇది చూసిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. జైపూర్లోని ఒక కాలనీలో ఉండే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వారికి 9 ఏళ్ళ పాప ఉంది. ముగ్గురే ఉంటారు. అయితే ఆ రోజు స్కూలుకు holiday ఉండడంతో పాప ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. పాప తల్లి పక్కింటి ఆంటీకి పాపను కాస్త చూడమని అప్పజెప్పి, ఉద్యోగానికి వెళ్ళిపోయింది.
తల్లి వెళ్లిన కాసేపటికి పాప తాను బయట ఆడుకుంటానని చెప్పి.. బైటికి వచ్చింది. అలా పాప బయట ఆడుకుంటున్న సమయంలో అదే కాలనీలో ఉండే ఒక అంకుల్ చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత పాపపై అత్యాచారం చేయబోగా పాప భయపడి ఏడుస్తూ గట్టిగా అరిచింది,
పాప అరుపులకు సదరు ఆంటీ, ఇరుగుపొరుగువారు ఏమైందోనని పరుగు పరుగున వెళ్లి చూశారు. వారంతా రావడం చూసిన అంకుల్ పారిపోయాడు. చిన్నారి వారికి అర్ధ నగ్నంగా కనిపించింది. దీంతో ఏమై ఉంటుందో వారు ఊహించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు పోక్సో చట్టం కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.