కామారెడ్డిలో దారుణం: భార్యను కొట్టి వివస్త్రను చేసి గెంటేసిన భర్త

Published : Feb 24, 2020, 11:37 AM IST
కామారెడ్డిలో దారుణం: భార్యను కొట్టి వివస్త్రను చేసి  గెంటేసిన భర్త

సారాంశం

కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతేకాదు ఆమెను నగ్నంగా చేసి ఇంటి నుండి బయటకు గెంటేశాడు. 

కామారెడ్డి:కామారెడ్డి జిల్లా భిక్కనూరులో  ఓ భర్త భార్యను  వివస్త్రను చేసి బయటకు గెంటేశారు. నగ్నంగానే పోలీ‌స్ స్టేషన్‌కు వెళ్లి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కుటుంబ కలహలతో కామారెడ్డి జిల్లా భిక్కనూరులో  ఓ భర్త తన భార్యపై అత్యంత దారుణంగా వ్యవహరించాడు. భార్యపై దాడి చేశాడు భర్త. అంతేకాదు ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. 

ఒంటిపై నూలు పోగులు లేకుండానే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు ఆమె ఒంటిపై బట్టలు కప్పారు.  భర్త పైశాచికత్వాన్ని చూసిన స్థానికులు  తీవ్రంగా మండిపడుతున్నారు.

భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 
 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే