యువతుల పేరుతో టెలిగ్రామ్ లో వల: హైద్రాబాద్‌లో కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

By narsimha lode  |  First Published Feb 28, 2023, 11:02 AM IST

టెలిగ్రామ్ యాప్ లో  యువతుల పేరుతో  వల వేసి డబ్బులు కొట్టేస్తున్నారు  సైబర్ నేరగాళ్లు.   ఈ తరహ నేరాల విషయమై  పోలీసులు  హెచ్చరిస్తున్న  జనం పట్టించుకోవడం లేదు. 
 



హైదరాబాద్: యువతుల  పేరుతో టెలిగ్రామ్ యాప్ లో  సైబర్ నేరగాళ్లు   పలువురికి కుచ్చుటోపి పెడుతున్నారు.   వారం రోజుల వ్యవధిలో  హైద్రాబాద్ లో   ఆరుగురి నుండి  రూ. 2.50 కోట్లు  కొట్టేశారు కేటుగాళ్లు.  బాధితులు   పోలీసులను  ఆశ్రయించారు. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

టెలిగ్రామ్  యాప్ లో  యువతుల ఫోటోలను ఎరగా వేసి  సైబర్ నేరగాళ్లు    డబ్బులు కొట్టేస్తున్నారు.యూట్యూబ్  వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే  లక్షల్లో కమీషన్ వస్తుందని  నమ్మబలికి   డబ్బులు కొట్టేస్తున్నారు దోపీడీదారులు. తాజాగా  హైద్రాబాద్  ముషీరాబాద్ కు  చెందిన  రియల్ ఏస్టేట్ వ్యాపారి నుండి  రూ. 8 లక్షలు కొట్టేశారు  సైబర్ నేరగాళ్లు. 

Latest Videos

గతంలో  కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  సైబర్  నేరగాళ్లు  పలు రూపాల్లో  డబ్బులను కొట్టేశారు. అయితే  తాజాగా  టెలిగ్రామ్ యాప్ ల్లో   సభ్యులుగా  ఉన్నవారిని లక్ష్యంగా  చేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు. 

హైద్రాబాద్ లో  ఆన్ లైన్ గేమింగ్ , బెట్టింగ్  నిర్వహిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను  పోలీసులు ఈ ఏడాది జనవరి  30వ తేదీన  అరెస్ట్  చేశారు.  గతంలో  ప్రముఖల పేర్లతో  సోషల్ మీడియా ద్వారా డబ్బులు పంపాలని  రిక్వెస్ట్  చేసేవారు. ఈ అభ్యర్ధలనలతో  డబ్బులు పంపినవారు పలువురు మోసపోయారు. ఐఎఎస్, ఐపీఎస్, మంత్రులు,  జడ్జిలు, రాజకీయ నేతల  పేర్లతో  సోషల్ మీడియాలో  డబ్బుల కోసం  రిక్వెస్ట్  పంపి  డబ్బులు  వసూలు  చేసిన ఘటనలపై పోలీసులు  కేసులు నమోదు  చేసిన విషయం తెలిసిందే. 

2022 డిసెంబర్  7వ తేదీన తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరజంన్ రెడ్డి  పేరుతో  కూడా  సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలుకు రిక్వెస్ట్  చేశారు. ఈ విషయం మంత్రి దృష్టికి వచ్చింది.   తన పేరుతో  డబ్బులు అడుగుతున్నారని అప్రమత్తంగా ఉండాలని మంత్రి  కోరారు.   ఈ విషయమై  పోలీసులకు కూడా ఆయన  ఫిర్యాదు  చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  బాపట్ల జిల్లాలో  యువతి పంపిన లింక్ ను క్లిక్  చేసిన  యువకుడి బ్యాంకు ఖాతా నుండి  రూ. 2.50 లక్షలు మాయమయ్యాయి.ఈ ఘటన  2022 మే 27వ తేదీన  జరిగింది. 

  దేవాన గణేష్   ఓ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గణేష్ కు ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది. దీంతో వీరిద్దరూ తరచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుకుందామని యువతి గణేష్ కి వీడియో కాల్ లింక్ ను పంపింది. ఈ లింక్ ను క్లిక్  చేసిన యువకుడి  బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయమయ్యాయి.
 

 

click me!