చెల్లి సాయంతో భార్యను హత్యచేసి.. ఆత్మహత్య డ్రామా.. భర్త, ఆడపడుచు అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published Oct 20, 2022, 12:08 PM IST

పెళ్లైన యేడాదికే భార్యను గొంతునులిమి హత్య చేశాడో కిరాతకుడైన భర్త. దీనికి అతని చెల్లి కూడా సాయం చేసింది. ఆ తరువాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 


హైదరాబాద్ : ఓ వ్యక్తి తన సోదరి సహాయంతో భార్యను గొంతుకోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి బాలాపూర్‌లో జరిగింది. అయితే, మంగళవారం రాత్రికి గానీ పోలీసు అధికారులకు తెలియలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఉమ్రా అంజుమ్ (18) ఆటోడ్రైవర్ హసన్ రిజ్వీని ఏడాది క్రితం పెళ్లాడింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గుల్బర్గాలో అంజుమ్ బంధువు వివాహానికి వెళ్లాలా వద్దా అనే విషయంపై గొడవ పడ్డారు.

సోమవారం పెళ్లి నుంచి తిరిగి వచ్చిన దంపతులిద్దరూ ఇదే విషయమై మళ్లీ గొడవ పడ్డారు. కోపంతో, రిజ్వీ తన సోదరి సహాయంతో అంజుమ్‌ను స్కార్ఫ్‌తో గొంతుకు ఉరివేసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత మహిళ మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అయితే మెడకు కట్టిన చున్ని తెగిపోయి బాధితురాలు నేలపై పడిపోయింది. దీంతో నిందితులు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి, ఆమె ఆత్మహత్య చేసుకుందని డాక్టర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.

Latest Videos

మునుగోడు ఉప ఎన్నిక : బీజేపీ స్టార్ క్యాంపెనర్లలో జీవితా రాజశేఖర్..

వారు చెబుతున్నది కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి ఆ మహిళ గొంతు నులిమడం వల్ల మరణించిందని.. ఇది హత్య అని, ఆత్మహత్య కాదని ప్రకటించారు. మంగళవారం రాత్రి పోలీసు అధికారులు రిజ్వీని, అతని సోదరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియోలో ఉన్న సదరు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.అందులో ఏముందంటే తన భార్యను ఓ భర్త చితకబాదుతున్నాడు. ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆ వీడియోను పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన భార్యను దారుణంగా కొట్టి, వీడియో తీసిన 27 ఏళ్ల యువకుడిని దిలీప్ గా మలైంకీజు పోలీసులు గుర్తించారు. అతడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. 

టీఆర్ఎస్‌కి షాక్:యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కి రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు

తిరువనంతపురం స్థానికుడైన దిలీప్ భార్య తన మాట వినకుండా, తనకిష్టం లేకుండా సూపర్ మార్కెట్‌లో పనికి వెడుతుందని ఆమెను కొట్టాడు. వీడియోలో దిలీప్ తన భార్యను దారుణంగా కొడుతున్న సమయంలో  ‘అప్పు తీర్చాలంటే ఉద్యోగానికి వెళ్లాలి' అని దిలీప్ భార్య చెప్పడం వీడియోలో వినపడుతోంది. కాగా దీన్నెవరో ఇంటర్నెట్‌లో పెట్టడంతో.. అక్కడ హల్‌చల్ చేసిన వీడియోలో మహిళ ముఖం రక్తసిక్తమైంది. దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు మలయంకీజు పోలీసులు నిందితుడిని హత్యాయత్నం, అనేక ఇతర అభియోగాల కింద అరెస్టు చేశారు.

click me!