తల్లి వివాహేతర సంబంధం.. కొడుకుకి తెలియడంతో..

Published : Dec 28, 2020, 09:26 AM IST
తల్లి వివాహేతర సంబంధం.. కొడుకుకి తెలియడంతో..

సారాంశం

మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవాడన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. అలాంటి తల్లి తనకు లేకపోయినా పర్వాలేదని భావించి.. ఆమెను అతి దారుణంగా గొంతు పిసికి చంపేశాడు

కన్న తల్లి.. తన తండ్రిని కాదని.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవాడన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. అలాంటి తల్లి తనకు లేకపోయినా పర్వాలేదని భావించి.. ఆమెను అతి దారుణంగా గొంతు పిసికి చంపేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జగద్గిరిగుట్ట పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ(40) కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఆమెకు భర్త, కుమారుడు కూడా ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో  ఆమె కొంత కాలంగా ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 

విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు ఆటో డ్రైవర్‌(24) ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో తల్లి మెడకు దుప్పటి చుట్టి గొంతు పిసికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...