హైద్రాబాద్ దూలపల్లిలో పరువు హత్య: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి హత్య

Published : Mar 03, 2023, 10:59 AM ISTUpdated : Mar 03, 2023, 04:12 PM IST
హైద్రాబాద్  దూలపల్లిలో  పరువు హత్య: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి హత్య

సారాంశం

హైద్రాబాద్  ధూలపల్లిలో  పరువు హత్య  జరిగింది.   ప్రేమ పెళ్లి  చేసుకున్న  హరీష్ ను బంధువులు  హత్య  చేశారు

హైదరాబాద్: నగర శివారులోని  దూలపల్లిలో  దారుణం  చోటు చేసుకుంది.  ప్రేమించి పెళ్లి  చేసుకున్న హరీష్ అనే యువకుడిని  బంధువులు  అత్యంత  దారుణంగా హత్య చేశారు.  భార్య ముందే   అత్యంత  కిరాతకంగా  హరీష్ ను హత్య  చేశారు. హరీష్ హత్యను  పరువు హత్యగా భావిస్తున్నారు.

హరీష్ భార్య  బంధువులే ఈ హత్య  చేశారు. ప్రైవేట్  మ్యూజిక్  సౌండ్ సిస్టమ్  కంపెనీలో   హరీష్  పనిచేస్తున్నాడు.   గత ఆరు మాసాల  క్రితం  హరీష్   ఇదే  ప్రాంతానికి  చెందిన యువతిని  ప్రేమించాడు. పెద్దలను  ఎదిరించి వివాహం  చేసుకున్నాడు.  దూలపల్లిలో  హరీష్  తన భార్యతో  నివాసం ఉంటున్నాడు.  శుక్రవారం నాడు రాత్రి  హరీష్ భార్య  బంధువులు  అతడిని హత్య  చేశారు.  ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.

గతంలో  కూడ  దేశంలోని  పలు ప్రాంతాల్లో  కూడ పరువు హత్యలు  జరిగాయి.  తెలంగాణ రాష్ట్రంలో  2017లో  యాదాద్రి భువనగిరి జిల్లాలో  జరిగిన  పరువు హత్య కలకలం రేపింది.  నరేష్  అనే  యువకుడు  స్వాతి  అనే యువతి  ప్రేమించుకున్నారు.  నరేష్ ను స్వాతి  తండ్రి  దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో సాక్షాాలు  లేనందున   ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని  నిర్ధోషులుగా  కోర్టు  ప్రకటించింది.ఏపీ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా చంద్రగిరి  నియోజకవర్గంలో గల  రెడ్డివారిపల్లెలో  ఇంటర్ విద్యార్ధి హత్య  కలకలం రేపిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్  2వ తేదీన   ఈ ఘటన  చోటు చేసుకుంది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?