మందుబాబులకి మరొకరు బలి... పీకలదాకా తాగి సైకిలిస్ట్‌ను కారుతో ఢీ, నిందితుడు ఎయిర్‌లైన్స్ ఉద్యోగి

By Siva KodatiFirst Published Jan 1, 2022, 2:27 PM IST
Highlights

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే నగరంలో డ్రంకెన్ డ్రైవ్‌కు (drunk and drive) మరొకరు బలయ్యారు. గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ (botanical garden gachibowli) ముందు జరిగిన ప్రమాదంలో ఐటీ ఉద్యోగి సతీశ్‌ మృతి చెందాడు. 

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే నగరంలో డ్రంకెన్ డ్రైవ్‌కు (drunk and drive) మరొకరు బలయ్యారు. గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ (botanical garden gachibowli) ముందు జరిగిన ప్రమాదంలో ఐటీ ఉద్యోగి సతీశ్‌ మృతి చెందాడు. సతీష్‌‌ను శశాంక్ అనే వ్యక్తి వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. తెల్లవారుజామున సైకిల్ తొక్కేందుకు సతీశ్ బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సతీశ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీశ్ కన్నుమూశాడు. ప్రమాదానికి కారణమైన శశాంక్.. ఎయిర్‌లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం అనంతరం శశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో శశాంక్‌కు 120 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 

కాగా.. new yearకి నగరం సంబరంగా స్వాగతం పలికింది. అయితే మరోవైపు పోలీసులు నగరంలో drunk and drive తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైకులు, ఏడు కార్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. 92 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ALso Read:మందుబాబుల వీరంగం.. కేకలు, అరుపులు, అనుచితపదజాలంతో యువతి హల్ చల్..

ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ woman హల్ చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు అర్ధరాత్రి సమయంలో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులను కట్టడి చేయడానికి పోలీసులు నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3,146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్లో 1,258, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,528. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. ఈ కమిషనరేట్ల పరిధిలో 265 బృందాలతో పోలీసులు తనిఖీలు చేశారు.

click me!