తెల్లారితే పెళ్లి అనగా.. బావమరిదిని చంపిన బావ..

By SumaBala BukkaFirst Published Feb 3, 2022, 11:17 AM IST
Highlights

వెంకటేశ్ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరిట ఉంది. అందులో కొంత భూమిని ఇటీవల వీర్లశంకర్ విక్రయించాడు. ఆ సొమ్ముతో వెంకటేష్ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తన భూమిని అమ్మేశాడు అన్న కోపంతో బావమరిది శంకర్ పై వెంకటేష్ కక్ష పెంచుకున్నాడు. గురువారం పెద్ద కుమార్తె ప్రవళిక marriage జరగాల్సి ఉంది. 

జగిత్యాల : తెల్లారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి, ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన jagityal మండలం అంబర్పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వీర్లశంకర్ (48),  ఆయన చెల్లెలు జమునను  అంబారుపేట వాసి ఆది వెంకటేష్ కి ఇచ్చి  వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక,  పూజిత.

కొన్నాళ్ళకు వెంకటేష్ మరో వివాహం చేసుకుని గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. వెంకటేశ్ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరిట ఉంది. అందులో కొంత భూమిని ఇటీవల వీర్లశంకర్ విక్రయించాడు. ఆ సొమ్ముతో వెంకటేష్ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తన భూమిని అమ్మేశాడు అన్న కోపంతో బావమరిది శంకర్ పై వెంకటేష్ కక్ష పెంచుకున్నాడు.  

గురువారం పెద్ద కుమార్తె ప్రవళిక marriage జరగాల్సి ఉంది. పెళ్లి పందిరికి అవసరమైన దుంపిడిగింజను కొట్టి తెస్తుండగా వెంకటేష్ వచ్చి శంకర్ తో గొడవకు దిగాడు. కోపం పట్టలేక axeతో దాడి చేసి తీవ్రంగా గాయపడిన శంకర్ ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. సంఘటనలో అడ్డు వెళ్లిన శంకర్ తల్లి గంగుకు గాయాలయ్యాయి.  పట్టణ సీఐ కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో గతంలో చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య నెలకొన్న వివాదం చివరకు ఓ నిండు ప్రాణం పోయేలా చేసింది. బావను సొంత బావమరిది అతి దారుణంగా హత్యచేశాడు. ఈ సంఘటన అమరావతిలోని ఇంటూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటూరు గ్రామానికి చెందిన కుంచాల అంకమరావుకు ప్రకాశం జిల్లా చీరాల మండలం, ఈపూరుపాలేనికి చెందిన పల్లెపు శ్రీను కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

అంకమరావు కూలీనాలి చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నవారి మధ్య ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో.. అప్పుడప్పుడు గొడవలు పడేవారు. మూడు సంవత్సరాల నుంచి దంపతులు ఇద్దరూ పలు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా 2020 లో ఘటన జరగడానికి రెండు నెలల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే.. చేసుకోవడానికి కూడా పనులు లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో దంపతుల మధ్య మరోసారి గొడవ చోటుచేసుకుంది. దీంతో.. లక్ష్మీ తిరుపతమ్మ ఆవేశంలో పరుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో.. ప్రాణాపాయం నుంచి బయటపడింది. 

తన సోదరి ఇలా చావు, బతుకుల మధ్య కొట్టుకోవడం చూసి లక్ష్మీ తిరుపతమ్మ సోదరుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఈ విషయంలో బావ అంకమరావుతో గొడవ పడ్డాడు. ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆవేశంలో బావ అంకమరావుపై బావమరిది వెంకటేష్ కత్తితో దాడి చేశాడు. దీంతో.. అంకమరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!