ఓయూ లేడీస్ హాస్టల్ లో కలకలం.. పోలీసుల అదుపులో అగంతకుడు

Published : Aug 21, 2019, 11:10 AM IST
ఓయూ లేడీస్ హాస్టల్ లో కలకలం.. పోలీసుల అదుపులో అగంతకుడు

సారాంశం

 గురువారం  తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో ఓ యువతి వాష్ రూమ్ కి వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ వెనుకవైపు ఉన్న గోడను దూకి ఓ యువకుడు లోపలికి వచ్చాడు. బాత్రూంలోకి యువతి వెళ్లడాన్ని చూసి బయట నుంచి గడిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూం డోర్ తెరుద్దామని యువతి ఎంత ప్రయత్నించినా.. రాలేదు. దీంతో... యువతి గట్టిగా డోర్ బాదింది.

కొద్ది రోజుల క్రితం ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి దూరి బీభత్సం సృష్టించిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతను అసలు హాస్టల్ లోకి ఎందుకు వెళ్లాడనే విషయం తెలుసుకొని పోలీసులు కూడా షాకయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గత గురువారం  తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో ఓ యువతి వాష్ రూమ్ కి వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ వెనుకవైపు ఉన్న గోడను దూకి ఓ యువకుడు లోపలికి వచ్చాడు. బాత్రూంలోకి యువతి వెళ్లడాన్ని చూసి బయట నుంచి గడిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూం డోర్ తెరుద్దామని యువతి ఎంత ప్రయత్నించినా.. రాలేదు. దీంతో... యువతి గట్టిగా డోర్ బాదింది.

దీంతో... ఆ యువకుడు బాత్ రూం గోడపైకి ఎక్కాడు. అరిస్తేచంపేస్తానంటూ ఆమెను కత్తితో బెదిరించాడు. తర్వాత బాత్రూం లోపలకు వంగి డోర్ గడియ తీసి ఆమెను బయటకు లాక్కొచ్చాడు. ఈ యువతి అరుపులకు నిద్రలేచిన ఇతర యువతులు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో...వాళ్ల గదులకు గడియ పెట్టాడు..

అనంతరం యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమెను రక్షించేందుకు ఇతర అమ్మాయిలు గట్టిగా కేకలు వేయడంతో... భయపడిపోయిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ యువతి ఫోన్ ని లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఆ ఫోన్... హాస్టల్ గోడ దక్కర ముక్కలై లభించింది. కాగా... హాస్టల్ లో అమ్మాయిలకు భద్రత లేకుండాపోయిందని... ఆ అగంతకుడిని ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తాజాగా అతనిని అరెస్టు చేశారు. కాగా.. తాను కేవలం సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి మాత్రమే హాస్టల్ లో దూరినట్లు అతను చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu