తెరుచుకోని అంబులెన్స్ డోర్... వ్యక్తి ప్రాణాలు గాల్లో..

By telugu teamFirst Published Aug 21, 2019, 10:51 AM IST
Highlights

అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వద్దకు ప్రయాణికులు ఆనంద్ ని తీసుకు వెళ్లారు. అయితే... ఎంతసేపు ప్రయత్నించినా అంబులెన్స్ డోర్ తెరుచుకోలేదు. అద్దాలు పగలకొట్టి... డోర్ తెరవడానికి దాదాపు 30నిమిషాలు పట్టింది. 

అంబులెన్స్ డోర్ సమయానికి తెరుచుకోకపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సిన అంబులెన్స్ లో సమస్య రావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అల్మాస్ గూడకు చెందిన ఆనంద్(50) బేగంపేటలో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. బేగంపేట నుంచి ఫలక్ నుమా కు ఎంఎంటీఎస్ లో వెళ్తున్న సమయంలో మలక్ పేట స్టేషన్ వద్ద ఆనంద్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ప్రయాణికులు వెంటనే స్పందించి 108కు  సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వద్దకు ప్రయాణికులు ఆనంద్ ని తీసుకు వెళ్లారు. అయితే... ఎంతసేపు ప్రయత్నించినా అంబులెన్స్ డోర్ తెరుచుకోలేదు. అద్దాలు పగలకొట్టి... డోర్ తెరవడానికి దాదాపు 30నిమిషాలు పట్టింది. ఈ లోపు ఆనంద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తోటి ప్రయాణికుడు మజర్ మాట్లాడుతూ... అతనిని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశాం. కాళ్లు, చేతులు రుద్దుతూ సపర్యలు చేశాం. అంబులెన్స్ సిబ్బంది కూడా ఎంతో సహాయం చేశారు. కానీ సమయానికి డోర్ తెరుచుకోకపోవడంతో ఇంజెక్షన్ ఇవ్వలేకపోయారు. దీంతో అతను చనిపోయాడని అతను పేర్కొన్నాడు. 

click me!