నన్ను పెళ్లి చేసుకోకపోతే... నీ భర్తను చంపేస్తా

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 9:55 AM IST
Highlights

తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. ఆమె భర్తను చంపి ఆమెను పెళ్లిచేసుకుంటానని వేధించసాగాడు. వీటిని తట్టుకోలేని మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

నన్ను పెళ్లి చేసుకో.. లేకపోతే నీ భర్తను చంపేస్తానంటూ.. ఓ వ్యక్తి వివాహితను బెదిరించాడు.  అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడు ఆ వ్యక్తి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...గాజుల రామారానికి చెందిన ఓ మహిళ అదే ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఆట్ల సతీశ్‌(30)తో సదరు మహిళకు గతంలో పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని సతీశ్‌ ఆ మెను పలు విధాలుగా వేధిస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. ఆమె భర్తను చంపి ఆమెను పెళ్లిచేసుకుంటానని వేధించసాగాడు. వీటిని తట్టుకోలేని మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

కుటుంబసభ్యులు కేపీహెచ్‌బీ నాలుగోరోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. సతీశ్‌ కూడా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న మహిళను అందరూ చూస్తుండగానే వేధించాడు. తనను పెళ్లిచేసుకోవాలని బెదిరిస్తూ ఆమె చేతిపై గాట్లు పెట్టాడు. దీంతో కుటుంబసభ్యులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. వారు సతీశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఆమెను వేధించినందుకు నిందితుడిపె జీడిమెట్ల ఠాణాలో కేసు నమోదైందని సీఐ చెప్పారు.

Last Updated 19, Sep 2018, 9:23 AM IST