కూతురిపై అత్యాచారం... నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

Published : Dec 19, 2019, 08:43 AM IST
కూతురిపై అత్యాచారం... నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

సారాంశం

 నిందితుడి భార్యకు ముందుగానే మరోకొరి తో వివాహమైంది. పాప పుట్టిన తర్వాత ఆమె అతనితో విడిపోయి.. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

కూతురిపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.... ఆ నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. కాగా.... అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా..  వారిలో ఓ  నాలుగేళ్ల చిన్నారి తన భార్య మొదటి పెళ్లి సంతానం కావడం గమనార్హం. నిందితుడి భార్యకు ముందుగానే మరోకొరి తో వివాహమైంది. పాప పుట్టిన తర్వాత ఆమె అతనితో విడిపోయి.. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఈ క్రమంలో... ఇటీవల సదరు వ్యక్తి... నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది మార్చి లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం భార్యకు తెలిసి అతనిని నిలదీయడంతో... ఆమెను దారుణంగా హింసించాడు. దీంతో... సదరు మహిళ కూతురితో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు.

కాగా... ఈ కేసు బుధవారం కోర్టు ముందుకు వచ్చింది. కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా రూ.వెయ్యి జరిమానా కూడా విధించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?