రంగారెడ్డి జిల్లా కోర్టులో హత్యకు కుట్ర.. అక్కను మోసం చేశాడనే కోపంతో..

Published : May 25, 2022, 04:28 PM ISTUpdated : May 25, 2022, 04:33 PM IST
రంగారెడ్డి జిల్లా కోర్టులో హత్యకు కుట్ర.. అక్కను మోసం చేశాడనే కోపంతో..

సారాంశం

రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఓ వ్యక్తి కత్తి తీసుకుని వచ్చాడు. క‌త్తితో కోర్టు లోప‌లికి ప్ర‌వేశించాడు.. అయితే అతడి వద్ద కత్తిని గుర్తించిన కోర్టు భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు.


రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఓ వ్యక్తి కత్తి తీసుకుని వచ్చాడు. క‌త్తితో కోర్టు లోప‌లికి ప్ర‌వేశించాడు.. అయితే అతడి వద్ద కత్తిని గుర్తించిన కోర్టు భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు. వివరాలు.. సాయి కిరణ్ అనే వ్యక్తి అక్కపెళ్లి గతేడాది అక్బర్‌తో జరిగింది. వీరిది ప్రేమ పెళ్లి. అయితే అక్బర్ తన అక్కను ప్రేమ పెళ్లి చేసుకుని వదిలేశాడు. ఈ కేసు విచార‌ణ కోర్టులో ఉండ‌టంతో.. అక్బర్ కోర్టుకు వ‌చ్చాడు. ఈ విష‌యం తెలుసుకున్న సాయికిర‌ణ్.. అక్బర్‌ను హత్య చేసేందుకు కోర్టుకు చేరుకున్నాడు. 

ఈ క్రమంలోనే సాయి కిరణ్ కత్తి పట్టుకుని కోర్టుకు వచ్చాడు. సాయి కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. కత్తి పట్టుకుని కోర్టు ఆవరణలో తిరిగాడు. అయితే సాయి కిరణ్ వద్ద కత్తిని గుర్తించిన కోర్టు భద్రతా సిబ్బంది గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం సాయి కిరణ్‌ను, అతడి స్నేహితుడిని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు