సికింద్రాబాద్‌లో నకిలీ డాక్టర్ ఓ వృద్ధురాలికి కుచ్చుటోపీ పెట్టాడు. జబ్బు నయం చేస్తానంటూ లాడ్జికి తీసుకెళ్లి బంగారంతో పరార్ అయ్యాడు.
సికింద్రాబాద్‌లో నకిలీ డాక్టర్ ఓ వృద్ధురాలికి కుచ్చుటోపీ పెట్టాడు. రైల్లో ప్రయాణిస్తుండగా తాను నిమ్స్‌లో డాక్టర్‌నంటూ పరిచయం చేసుకున్న ఆ కేటుగాడు.. వృద్ధురాలి అనారోగ్యం గురించి వాకబు చేశాడు. అనంతరం నిమిషాల్లో జబ్బు నయం చేస్తానని నమ్మించి ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం ఏవో మందులు ఇచ్చి వేసుకోమన్నాడు. అవి వేసుకోగానే బాధితురాలు స్పృహ తప్పింది. ఇదే అదనుగా భావించిన కేటుగాడు .. వృద్ధురాలి ఒంటిపై వున్న బంగారాన్ని దోచుకుని పారిపోయాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి.. వెంటనే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.