జగిత్యాలలో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం : స్మశానంలో బూడిద పూసుకుని ..నగ్నంగా తిరిగిన యువకుడు

Siva Kodati |  
Published : May 18, 2023, 03:39 PM IST
జగిత్యాలలో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం : స్మశానంలో బూడిద పూసుకుని ..నగ్నంగా తిరిగిన యువకుడు

సారాంశం

జగిత్యాల పట్టణంలో ఓ యువకుడు అర్ధరాత్రి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. స్మశాన వాటికలో నగ్నంగా తిరుగుతూ బూడిదను ఒళ్లంతా పూసుకున్నాడు.

జగిత్యాల పట్టణంలో ఓ యువకుడు అర్ధరాత్రి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. స్థానికంగా వున్న స్మశానంలోకి వెళ్లి, ఒంటి నిండా చితా భస్మం పూసుకుని హంగామా సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ యువకుడు స్మశాన వాటికలో నగ్నంగా తిరుగుతూ బూడిదను ఒళ్లంతా పూసుకున్నాడు. ఆపై ఏవో మంత్రాలు చదువుతూ పూజలు చేశాడు. దీనిని గమనించిన స్థానికులు కర్రలతో అతనిని వెంబడించగా.. అక్కడి నుంచి పారిపోయాడు. అటు కొద్దిరోజుల క్రితం కొత్త బస్టాండ్ వద్ద వున్న ఓ హోటల్ వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి, కోడిని కోసి క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. తాజాగా స్మశానంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?