హైదరాబాదులోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి అంత్యక్రియల నిర్వహణ వివాదానికి దారి తీసింది. ఆ వ్యక్తి భార్య కేటీఆర్ కు ఫిర్యాదు చేయడంతో గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థపురం కరోనా మృతుడి అంత్యక్రియలపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వనస్థపురం ప్రాంతానికి చెందిన మాధవి అనే మహిళ తన భర్త బతికున్నాడా, చనిపోయాడా అని ప్రశ్నిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసిన విషయం విదితమే. గాంధీ ఆస్పత్రిపై, జిహెచ్ఎంసీపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఆ వివాదంపై గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ స్పందించారు. మదుసూదన్ అనే కోరనా వైరస్ రోగి కోవిడ్ ఆస్పత్రిలో చేరాడని, ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోగానే మరణి్ంచాడని ఆయన చెప్పారు.
undefined
Also Read: నా భర్త బ్రతికున్నాడా చనిపోయాడా?: ఆవేదనతో కేటీఆర్ కి మహిళ ఫిర్యాదు
మదుసూదన్ మృతి చెందిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులంతా కోవిడ్ ఆస్పత్రిలో ఉన్నారని, తమ వద్ద వారు సంతకాలు చేసిన రికార్డులున్నాయని ఆయన చెప్పారు. ప్రోటోకాల్ ప్రకాంర తాము మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని, జిహెచ్ఎంసివాళ్లు అంత్యక్రియలు నిర్వహించారని ఆయన చెప్పారు.
కరోనా చికిత్స కోసం తీసుకుని వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ మహిళ కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త, ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదని ఆమె కేటీఆర్ కు ట్వీట్ చేశారు.