తినడానికి కూర్చున్న వ్యక్తి.. కూర్చున్నట్లే...!

Published : Jun 05, 2021, 09:03 AM IST
తినడానికి కూర్చున్న వ్యక్తి.. కూర్చున్నట్లే...!

సారాంశం

అదే రోజు తూఫ్రాన్ మీదుగా స్వగ్రామానికి బయలు దేరి.. తూఫ్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద మద్యం తాగేందుకు ఆగాడు.  

ఓ వ్యక్తి తినడానికి  బర్గర్ తెచ్చుకున్నాడు.. పక్కనే తాగడానికి మందు కూడా కలుపుకున్నాడు. అతని చెయ్యి.. బర్గర్ మీద ఉంది.. కానీ.. అది నోట్లోకి పోలేదు. ఎలా కూర్చున్నాడో.. అలానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు(46) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు గురువారం మధ్యాహ్నం హాజరయ్యాడు. అదే రోజు తూఫ్రాన్ మీదుగా స్వగ్రామానికి బయలు దేరి.. తూఫ్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద మద్యం తాగేందుకు ఆగాడు.

మద్యం ఆహారం తెచ్చుకొని తూఫ్రాన్-గజ్వేల్ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చొని.. తినడానికి చేతిని ఆ బర్గర్ లో పెట్టాడు. కనీసం అది నోట్లో కూడా పెట్టుకోకుండా ప్రాణాలు కోల్పోయాడు. హార్ట్ ఎటాక్ తో చనిపోవడం గమనార్హం.

సాయిలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, కుటుంసబభ్యులు ఆయన కోసం వెతకగా.. సాయిలు మృతదేహం కనిపించింది. వ్యసాయం చేసుకొని జీవించే  సాయిలుకు భార్య ఉంది. కానీ పిల్లలు లేరు. 

ఈ ఘటనపై తూఫ్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు అమర్ సింగ్ ను అడగా.. సైలెంట్ మయోకార్డియల్ ఇన్ ఫార్ క్షన్ వల్ల గుండెపోటు వచ్చిందని.. దీంతో.. నొప్పి కూడా తెలీకుండా ప్రాణాలు పోయాయని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!