నాడు కేసీఆర్ పై ప్రశంసలు.. నెట్టింట ఈటలపై విమర్శలు

Published : Jun 05, 2021, 07:37 AM IST
నాడు కేసీఆర్ పై ప్రశంసలు.. నెట్టింట ఈటలపై విమర్శలు

సారాంశం

గతంలో.. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ లకు మద్దుతుగా.. బీజేపీ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవితోపాటు... టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సమయంలో... ఈటల.. సీఎం కేసీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ లను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. అయితే.. అలా కేసీఆర్ పై విమర్శలు చేయడాన్ని టీఆర్ఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే... ఈటలను నెట్టింట టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతుండటం విశేషం.

గతంలో.. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ లకు మద్దుతుగా.. బీజేపీ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

‘ కేసీఆర్.. ముదిరాజ్ ల తల్లిపాలు తాగి పెరిగారు. ఆ ప్రేమతోనే ముదిరాజ్ ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకూ ఓ కేసీఆర్ ఉంటే బాగుండని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదు. కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ భూస్థాపితం అవుతుంది’ అంటూ గతంలో ఈటల మాట్లాడిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తుండటం గమనార్హం.

ఇక ఎంపీ సంతోష్ కుమార్ పై కూడా ప్రశంసలు కురిపించిన వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. అందులో.. తెలంగాణ ఉద్యమంలో సంతోష్.. కేసీఆర్ కి వెన్నంటే అండగా ఉన్నాడని.. చాలా కష్టపడ్డాడని చెప్పడం గమనార్హం. కాగా.. ఇప్పుడు పార్టీ మారగానే.. విమర్శలు చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం. మరి వీటిపై ఈటల ఎలా స్పందిస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!