అర్థరాత్రి ప్రయాణం.. ట్రాక్టర్ ఢీకొట్టడంతో...

Published : Aug 05, 2020, 08:59 AM IST
అర్థరాత్రి ప్రయాణం.. ట్రాక్టర్ ఢీకొట్టడంతో...

సారాంశం

కాకరవాయిలో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి అత్తగారి ఊరైన సూర్యపేట జిల్లా ఆత్మకూరుకు బయలు దేరాడు. ఈ క్రమంలో అతనిని ట్రాక్టర్ ఢీ కొట్టింది. 

చీకట్లో ప్రయాణం అతని ప్రాణం తీసింది. బంధువులను పలకరించి అర్థరాత్రి వేళ బైక్ పై వస్తున్న ఓ యువకుడిని ట్రాక్టర్ ఢీ కొట్టింది. కాగా..  ఆ ట్రాక్టర్ కి వ్యవసాయ పరికరాలు అమర్చి ఉండటంతో.. అవి అతనికి గుచ్చుకున్నాయి. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన సూర్యపేట జిల్లా మోతె మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం పట్ణణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్(27) అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి అత్తగారి ఊరైన సూర్యపేట జిల్లా ఆత్మకూరుకు బయలు దేరాడు. ఈ క్రమంలో అతనిని ట్రాక్టర్ ఢీ కొట్టింది. పొలం దున్నడానికి వెళ్తున్న ట్రాక్టర్ కావడంతో.. దానికి వ్యవసాయ పనిముట్లు అమర్చి ఉన్నాయి. అవి తీవ్రంగా గుచ్చుకోవడంతో.. సంతోష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా...సంతోష్ కుటుంబంలో తీవ్ర విషాచాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం