పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టిన పందెంకోడి..!

By AN TeluguFirst Published Feb 27, 2021, 4:52 PM IST
Highlights

జగిత్యాలలో పందెంకోడిని అరెస్ట్ చేసిన ఘటన పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్ స్టేషన్ లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఫోటో తీసి.. కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 

జగిత్యాలలో పందెంకోడిని అరెస్ట్ చేసిన ఘటన పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్ స్టేషన్ లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఫోటో తీసి.. కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ లో ఈ నెల 22న కొందరు కోడి పందాలు ఆడారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం కొండాపూర్ కు చెందిన తునుగుల సంతోష్ కూడా లొత్తునూర్ ఎల్లమ్మ గుట్ట దగ్గర జరిగిన కోడిపందెంలో పాల్గొన్నాడు. 

పందెంలో కోడిని వదిలేందుకు సతీష్ తన కోడికి కత్తులు కట్టాడు. దాన్ని వదులుదామని వంగగా అది ఒక్కసారిగా ఎగిరి తన్నింది. దీంతో కోడి కాళ్లకు కట్టిన కత్తులు సతీశ్ మర్మాంగాలకు గుచ్చుకున్నాయి. దీంతో గాయాలై సతీశ్ మృతి చెందాడు. విషయం తెలియగానే గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని సతీశ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సతీశ్ చనిపోవడానికి కారణమైన కోడి అక్కడే ఉండడంతో ఠాణాకు తీసుకొచ్చి, కాసేపటి తరువాత సంరక్షణ కోసం కోళ్ల ఫాంకి తరలించారు. ఈ లోపే ఎవరో గుర్తుతెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కోడిని ఫొటో తీశాడు. అంతేకాకుండా పోలీసులు కోడిని అరెస్ట్‌ చేశారంటూ  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరలై కూచుంది. 

దీంతో రాష్ట్రస్తాయి పోలీసు అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్సై జీవన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 

సంఘటన ప్రాంతంలో కోడి ఉండడంతో సంరక్షించేందుకే పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చామని, అరెస్ట్ చేయలేదని తెలిపారు. అరగంట తరువాత కోళ్లఫారానికి తరలించామన్నారు. కోడి పందేలలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

click me!