మేడారం: ముగ్గురు ఆలయ సిబ్బందికి కరోనా.. భక్తుల్లో ఆందోళన

By Siva KodatiFirst Published Feb 27, 2021, 2:29 PM IST
Highlights

మేడారంలో చిన్న జాతర వేళ కరోనా కలకలం సృష్టించింది. విధుల్లో వున్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. అలాగే వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. 

వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. జాతర సందర్భంగా భక్తుల రక్షణకు అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు చిన్న జాతరలో భాగంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు.

మహా జాతరకు వచ్చినట్లే చిన్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారానికి భారీగా చేరుకుంటున్నారు.

జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెలపై సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

click me!