తెలంగాణలో మద్యం అమ్మకాల్లో అక్టోబర్ నెల ఆల్‌లైం రికార్డు.. ఒక్క నెలలోనే అన్ని కోట్లు తాగేశారా..

By team teluguFirst Published Nov 4, 2021, 7:31 AM IST
Highlights

తెలంగాణలో గత నెలలో మద్యం అమ్మకాలు (liquor sales) జోరుగా సాగాయి. అక్టోబర్ మాసంలో దసరా పండగ రావడం.. హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా భారీగా మద్యం పంపిణీ జరగడంతో అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

తెలంగాణలో గత నెలలో మద్యం అమ్మకాలు (liquor sales) జోరుగా సాగాయి. ఆల్ టైం రికార్డు సృష్టించాడు. కేవలం అక్టోబర్ నెలలోనే రూ. 2653.07 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ ప్రతి ఏడాది దసరా పండగ సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అవి మరింతగా పెరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్టోబర్ మాసంలో దసరా పండగ రావడం.. హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా భారీగా మద్యం పంపిణీ జరగడంతో అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైనట్టుగా తెలుస్తోంది.

Also read: దీపావళి: సుప్రీం నిర్ణయానికే తెలంగాణ ఓటు.. బాణాసంచాపై ఆంక్షలు

ఈ ఏడాది అక్టోబర్‌లో మద్యం అమ్మకాలు.. గతేడాదితో పోలిస్తే రూ. 30 కోట్లు పెరిగాయి. కరీంనగర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో విక్రయాలు గతేడాది అక్టోబర్ కన్నా దాదాపు రూ. 4 కోట్లకు పైగా పెరిగాయి. అయితే ఈ అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల విక్రయాల్లో పెంపు నమోదైంది. గతేడాది అక్టోబర్‌లో 26.93 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 31.43 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.

ఇక, దసరా పండగ సందర్భంగా కేవలం 5 రోజుల్లోనే (అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16) రూ. 685 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఐదు రోజుల్లో 8.34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు సాగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ. 57 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఆ తర్వాత స్థానంలో రూ. 43 కోట్లతో హైదరాబాద్‌ నిలిచింది. 

Also read: యాసంగిలో వరి సాగు.. ఆ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే: సిద్ధిపేట కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

ఇదిలా ఉంటే.. కరోనా ఎఫెక్ట్‌తో కొంత కాలంగా బీర్ల అమ్మకాలు తగ్గాయి. కరోనా భయంతో బీర్లు తాగేందుకు మందుబాబులు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో బీర్ల సేల్ పడిపోయింది. రెండు నెలల క్రితం వరకు కూడా బీర్ల సేల్ చాలా తక్కువగా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ భారీగా జరగడం, కరోనా కేసులు కూడా తగ్గడంతో బీర్ల అమ్మకాలు పెరిగాయి. 

click me!