మద్యం మత్తులో ఒళ్లు తెలియక.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి...

By SumaBala BukkaFirst Published Oct 17, 2022, 10:41 AM IST
Highlights

మద్యం మత్తులో ఒళ్లూపై తెలియక.. ఏం చేస్తున్నాడో అర్థం కాక ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. దీంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లేలోగా మృతి చెందాడు. 

ఆదిలాబాద్ : మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమాకలో జరిగింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాకకు చెందిన కోట్నాక హన్మంత్ రావు (25) మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఉదయం తాగిన మైకంలో బహిర్భూమికి వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. దీంతో స్పృహ కోల్పోయాడు.

ఇది గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆ తరువాత 108కి ఫోన్ చేశారు. కుటుంబసభ్యులు వచ్చి అంబులెన్స్ లో అతడిని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందాడు. ఈ మేరకు డాక్టర్లు నిర్తారించారు. ఎస్ఐ డి. సునీల్, పోలీసులు రిమ్స్ కు వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. అతడికి భార్య హీరాబాయి, నాలుగు నెలల పాప ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. 

భార్య పై అనుమానం.. నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదంటూ లేఖ రాసి ఆమె అదృశ్యం..

ఇదిలా ఉండగా, అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నగరానికి చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకోగా.. దొంగతనానికి వచ్చావంటూ పక్కింటి వారు కొట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కర్నాటి కోమలేశ్వరి (17) ఏలూరులోనే ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. తండ్రి గతంలోనే మృతి చెందటంతో తల్లి పద్మావతే కుటుంబాన్ని పోషిస్తోంది. గత నెల 25న పక్కింట్లో కుక్క పిల్లలను చూసేందుకు కోమల్లేశ్వరి వెళ్ళింది. అయితే ఆ ఇంట్లోని భార్య భర్తలు  ఆమెను.. దొంగతనం చేసేందుకు వచ్చావా?  అంటూ కొట్టారని  ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అదేరోజు ఆమె పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నాన్నమ్మ వెంకటరమణ ఇంటికి వెళ్ళింది. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి  ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీన రాత్రి ఆమె మృతిచెందింది. దీనిపై ఏలూరు త్రీ టౌన్ సిఐ ప్రసాదరావు మాట్లాడుతూ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

click me!