వారంలో పెళ్లి.. బండరాయితో కొట్టుకుని, యువకుడి ఆత్మహత్య..!

Published : Sep 14, 2021, 11:23 AM IST
వారంలో పెళ్లి.. బండరాయితో కొట్టుకుని, యువకుడి ఆత్మహత్య..!

సారాంశం

నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  7 రోజుల్లో వివాహం పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.  కుబీర్ మండలం  దోడర్నా తండా  నాల్గవ గ్రామానికి చెందిన రాజేందర్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం నల్గొండ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 

మనసులో ఉన్నది చెప్పలేకపోవడం.. అసంతృప్తి, వద్దు అనే మాటకు మొహమాటపడడం ఓ నిండు జీవితాన్ని బలవన్మరణం దిశగా పయనించేలా చేసింది. ఇష్టంలేని పెళ్లిని తప్పించుకోవడానికి జీవితాన్నే బలి తీసుకున్నాడో యువకుడు. ఈ విషాద ఘటన తెలంగాణలో జరిగింది.

నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  7 రోజుల్లో వివాహం పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.  కుబీర్ మండలం  దోడర్నా తండా  నాల్గవ గ్రామానికి చెందిన రాజేందర్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం నల్గొండ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.  ఈనెల 21వ తేదీన  రాజేందర్ వివాహం జరగాల్సి ఉంది.

ఈ క్రమంలో ప్రస్తుతం రాజేందర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.  అయితే,  ఆ పెళ్లి ఇష్టం లేక రాజేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?