నిమ్స్ లో దారుణం.. చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

Published : Jan 12, 2021, 10:05 AM IST
నిమ్స్ లో దారుణం.. చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

సారాంశం

హైదరాబాద్ లోని నిమ్స్ లో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆసుపత్రిలో కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి నిమ్స్‌ ఆవరణలో చెట్టుకు ఉరేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిమ్స్‌ ఆసుపత్రిలోని మిలీనియం బ్లాక్‌ వెనకభాగంలో ఉన్న పార్కింగ్‌ దగ్గరున్న చెట్టుకు సోమవారం ఉదయం ఓ వ్యక్తి లుంగీతో  ఉరివేసుకొని వేలాడుతుండటం స్థానికులు గుర్తించారు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్నపంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. ఆధారాల కోసం మృతదేహాన్ని వెతకగా ఎలాంటి గుర్తింపు కార్డులు కనిపించలేదు. 

అతని వయస్సు సుమారు (45) ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 
PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం