భువనగిరి కలెక్టర్ ఛాంబర్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

Published : Dec 13, 2021, 01:01 PM IST
భువనగిరి కలెక్టర్ ఛాంబర్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

సారాంశం

ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో మహేష్ మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాధితుడితో మాట్లాడి  సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు.

భువనగిరి కలెక్టరేట్ ఛాంబర్ లో బుడిగే మహేష్ అనే వ్యక్తి suicideకు యత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకోవడానికి యత్నిస్తుండగా Collectorateసిబ్బంది అతడిని అడ్డుకున్నారు. మహేష్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20 యేళ్ల కిందట 4 ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు చేశారు.

ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో మహేష్ మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాధితుడితో మాట్లాడి  సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు.

ఇదిలా ఉండగా, నిజామాబాద్ కలెక్టరేట్ లో యాదగిరి  తన కుటుంబసభ్యులతో అక్టోబర్ 25న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు  వెంటనే గుర్తించి  యాదగిరి కుటుంబసభ్యులను అడ్డుకొన్నారు. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం ఏర్పుల గ్రామానికి చెందిన Yadagiri అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కు తన ఫ్లాట్ ను విక్రయించాడు. అయితే ఈ Plot ను కొనుగోలు చేసిన సర్పంచ్ తనకు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు యాదగిరి ఆరోపించారు. 

Shilpa Chowdary: రోజుకో మలుపు.. రూ. 7 కోట్లు తిరిగి ఇచ్చేస్తా..విచారణలో ఆ ముగ్గురి పేర్లు చెప్పిన శిల్ప..!

ఈ విషయమై ఇవాళ Collectorate లో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యాదగిరి తన కుటుంబసభ్యులతో కలిసి  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది యాదగిరిని అడ్డుకొన్నారు.  ఈ విషయమై కలెక్టర్ వద్దకు పంపుతామని సెక్యూరిటీ సిబ్బంది హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కలెక్టరేట్  ల వద్ద ఆత్మహత్యాయత్నాలు చేసుకొన్న ఘటనలు పెద్ద ఎత్తున సంచలనం కల్గించాయి.

గతంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ  ఘటనలో తహసీల్దార్  అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. తహసీల్దార్ కార్యాలయాల్లో వినతులు తీసుకొనేందుకు కొన్ని చోట్ల అధికారులు బారికేడ్లు కూడ ఏర్పాటు చేసుకొన్న విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు