హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. పెళ్లి మండపంలో ఆత్మహత్య చేసుకున్న వధువు ప్రియుడు..

Published : Jul 04, 2022, 04:48 PM IST
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. పెళ్లి మండపంలో ఆత్మహత్య చేసుకున్న వధువు ప్రియుడు..

సారాంశం

హైదరాబాద్ లంగర్ హౌస్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి మండలంలో వధువు ప్రియుడు ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

హైదరాబాద్ లంగర్ హౌస్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి మండలంలో వధువు ప్రియుడు ఆత్మహత్యకు యత్నించాడు. తన ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని తీవ్ర మనస్థాపం చెందిన అతడు.. నేరుగా ఆమె పెళ్లి జరుగుతున్న చోటుకువచ్చాడు. పెళ్లి మండపంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తర్వాత పెళ్లి కూతురు వద్దకు వెళ్లి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే పక్కున్నవారు పెళ్లి కూతురును పక్కకి లాగారు. దీంతో ఆమె స్వల్ప గాయాలతో బయటపడంది. 

ఆత్మహత్యకు యత్నించిన అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడి వారు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే