సిరిసిల్ల: ఆత్మహత్యకు యత్నించి... ప్రాణభయంతో కాపాడాలంటూ వేడుకున్న కరీంనగర్ వాసి

Arun Kumar P   | Asianet News
Published : Oct 24, 2021, 09:58 AM IST
సిరిసిల్ల: ఆత్మహత్యకు యత్నించి... ప్రాణభయంతో కాపాడాలంటూ వేడుకున్న కరీంనగర్ వాసి

సారాంశం

ప్రాణాలు తీసుకునేందుకు ధైర్యం చాలక చివరినిమిషంలో ఆత్మహత్యను విరమించుకుని తనను కాపాడాలంటూ వేడుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

కరీంనగర్: మన ప్రాణాలు మనమే తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలా ధైర్యం చేసి చావాలనుకున్న ఓ వ్యక్తికి ఆత్మహత్య చేసుకునే సమయంలో ప్రాణభయం పట్టుకుంది. దీంతో ప్రాణాలు పోయే సమయంలో తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  karimnagar district కిసాన్ నగర్ కు చెందిన ముల్కల దేవయ్య ఏం కష్టం వచ్చిందోగానీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం siricilla distric బోయినిపల్లి మండలంలోని కొదురుపాక సమీపంలో మిడ్ మానేరులో దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించాడు. ధైర్యం కూడగట్టుకుని వంతెనపైనుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులోకి దూకాడు. 

అయితే ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతుండగా దేవయ్యకు ప్రాణాలపై తీపి కలిగింది. దీంతో ఓ చెట్టు కొమ్మను పట్టుకుని రక్షించాలంటూ వేడుకున్నాడు. అతడిని గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

read more  16వ అంతస్తు నుంచి కిందపడి టెక్కీ మృతి..!

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానిక జాలర్ల సాయంతో అతడిని కాపాడారు. తెప్పలసాయంతో అతడి కాపాడే ప్రయత్నం చేసినా నీటి ప్రవాహం అధికంగా వుండటంతో అతడివద్దకు చేరుకోలేక పోయారు. దీంతో రెండు మూడు గంటలపాటు దేవయ్య ప్రాణభయంతో చెట్టుకొమ్మకే వేలాడాల్సి వచ్చింది. చివరకు గజ ఈతగాళ్లు, మత్స్యకారులు ఎలాగోలా అతడివద్దకు చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 

ఇలా ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆత్మహత్యకు యత్నించి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. దేవయ్య ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. సురక్షితంగా కాపాడిన తర్వాత దేవయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు పోలీసులు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్