కిషన్ రెడ్డి ఫ్లెక్సీల దహనం: యువకుడిని చితకబాదిన బీజేపీ కార్యకర్తలు

Siva Kodati |  
Published : Jul 21, 2019, 01:04 PM IST
కిషన్ రెడ్డి ఫ్లెక్సీల దహనం: యువకుడిని చితకబాదిన బీజేపీ కార్యకర్తలు

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను ఓ యువకుడు తగులబెెట్టడంతో హైాదరాబాద్ ఆసిఫ్ నగర్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆసిఫ్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి ఆధివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.

అయితే అక్కడ మంత్రికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఓ యువకుడు చించేసి, తగులబెట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ