హారితహారం పేరుతో పోడు భూముల్లోకి రావొద్దు: సోయం హెచ్చరిక

Siva Kodati |  
Published : Jul 21, 2019, 12:29 PM IST
హారితహారం పేరుతో పోడు భూముల్లోకి రావొద్దు: సోయం హెచ్చరిక

సారాంశం

హారితహారం పేరుతో ప్రభుత్వం ఆదివాసీల భూముల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోందని.. ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తే ఊరుకోనన్నారు బీజేపీ నేత సోయం బాపూరావు

పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయండి అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు బీజేపీ నేత సోయం బాపూరావు. ఆదివాసీల బాధలు స్వయంగా అనుభవించాను కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు.

పోడు భూముల జోలి కొస్తే మరోసారి ఇంద్రవెల్లి పోరాటం చేస్తామన్నారు. అడవుల్లోకి అధికారులొస్తే.. ఆదివాసీలంతా రోడ్లపైకొస్తారని సోయం హెచ్చరించారు. హరితహారం పేరుతో మొక్కలు నాటితే పీకేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అధికారులకు అడవుల్లోకి వెళ్లే అధికారం లేదని... ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తే ఊరుకోనన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ధర్నా చేస్తానని సోయం స్పష్టం చేశారు. ఢిల్లీలో ధర్నాకు మోడీ లేదా అమిత్ షాను ఆహ్వానిస్తానని సోయం బాపూరావు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ