పెళ్లైనా యువతికి ఆగని వేధింపులు.. యువకుడిని కొట్టి చంపేసి..!

Published : Sep 18, 2021, 09:34 AM IST
పెళ్లైనా యువతికి ఆగని వేధింపులు.. యువకుడిని కొట్టి చంపేసి..!

సారాంశం

ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు పథకం ప్రకారం.. ఈ నెల 9న ఆమె ద్వారా చైతన్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు.  

తమ అమ్మాయిని వేధిస్తున్నాడని.. యువతి కుటుంబసభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కొట్టి చంపేసి.. అనంతరం కాల్చేశారు. కాగా.. ఈ ఘటనను పోలీసులు కేవలం వారం రోజుల్లో చేధించడం గమనార్హం. ఆదిలాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడకు చెందిన బురత్కర్ చైతన్య(22) 2018లో ఉపాధి శిక్షణ పొందుతున్న సమయంలో ఓ యువతిని వేధించాడు. ఆమెకు వివాహమైనా కూడా చైతన్య ఆగడాలు మానలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు పథకం ప్రకారం.. ఈ నెల 9న ఆమె ద్వారా చైతన్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు.

రాగానే ఏడుగురు కుటుంబసభ్యులు అతనిపై దాడి చేశారు. పార, కట్టెలతో కొట్టి ప్రాణాలు తీశారు. అనంతరం పరపులో చుట్టి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు నటిస్తూ.. మృతదేమాన్ని ఆటోలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.  దారిలో పెట్రోల్ పోసి.. శవాన్ని తగలపెట్టారు. కాగా.. బాధితుడి కుటుంబసభ్యులు చైతన్య కనిపిచండం లేదంటూ ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేయగా.. అదృశ్యం కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా వారికి కాలిన శవం ఒకటి కనిపించింది. అది చైతన్యదేనని గుర్తదించారు. ఫోన్ వివరాలు, సీసీ కెమేరాల పుటేజీల ఆధారంగా నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం