24 గంటల్లో 241 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,63,026కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 17, 2021, 10:16 PM ISTUpdated : Sep 17, 2021, 10:40 PM IST
24 గంటల్లో 241 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,63,026కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 298 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,223 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 52,943 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 241 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6,63,026కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో 3,902 కొవిడ్‌కు బలయ్యారు. 

ఒక్కరోజు వ్యవధిలో 298 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,53,901కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 5,223 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 298 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 5, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 23, ఖమ్మం 14, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 11, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 16, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 3 , పెద్దపల్లి 8, సిరిసిల్ల 5, రంగారెడ్డి 14, సిద్దిపేట 7, సంగారెడ్డి 2, సూర్యాపేట 6, వికారాబాద్ 2, వనపర్తి 2, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 13, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu