టైలర్ హత్య... నిందితుడితో భార్య అక్రమ సంబంధం..?

Published : Apr 03, 2021, 08:26 AM IST
టైలర్ హత్య... నిందితుడితో భార్య అక్రమ సంబంధం..?

సారాంశం

హతుడి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు మెహదీపట్నం చౌరస్తాలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  

హైదరాబాద్ నగరంలో ఇటీవల ఓ టైలర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. అతని హత్య వెనక అక్రమ సంబంధం  కారణం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి భార్యతో.. అతనిని  చంపిన నిందితుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్ కార్మికనగర్ లో ఉండే టైలర్ సిద్ధిఖ్ అహ్మద్(38) మార్చి 30న ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. శ్రీరాం నగర్ లోని బావమరింది ఇంట్లో జరిగిన శుభాకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. అతనిని ఫాలో అవుతూ ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది.

ఆ తర్వాత నిందితుడు అదే రోజు ఉదయం హతుని ఇంట్లో నుంచి ఓ సంచితో సహా బయటకు వచ్చినట్లు గుర్తించారు. హతుడి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు మెహదీపట్నం చౌరస్తాలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అతని పేరు అలీగా నిర్థారించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను, రక్తపు మరకలను తుడిచివేసిన దుస్తువులను సంచిలో పెట్టుకొని నిందితుడు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. నిందితుడికి హతుని భార్య రూబీ పలు మార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నిందితుడికి.. ఆమెకు సంబంధం ఏమిటనే విషయంపై కూడా ఆరా తీస్తుున్నారు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందేమో.. అందుకే అతనిని చంపారేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?