గొడ్డళ్లతో వేటాడి, కంట్లో కారం కొట్టి యువకుడి హత్య.. కొడుకును చంపిన వ్యక్తిపై ప్రతీకారం..

Published : Nov 12, 2022, 06:48 AM IST
గొడ్డళ్లతో వేటాడి, కంట్లో కారం కొట్టి యువకుడి హత్య.. కొడుకును చంపిన వ్యక్తిపై ప్రతీకారం..

సారాంశం

కొడుకును చంపిన వ్యక్తిని రెండేళ్లపాటు ఆగి మరి కిరాతకంగా హతమార్చారు ఓ తల్లిదండ్రులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 

సంగారెడ్డి :తమ కుమారుడిని హతమార్చిన యువకుడిని అంతమొందించేందుకు ఆ తల్లిదండ్రులు రెండేళ్లుగా వెయిట్ చేశారు.  అదను చూసి గొడ్డలతో వేటాడి ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చెల్మెడ కు చెందిన బేగరి ఆనంద్.. అదే గ్రామానికి చెందిన తలారి ప్రవీణ్ ను 2020 అక్టోబర్ లో హత్య చేశాడు. జూదం ఆడుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశంతో హత్య చేయడంతో ఈ ఘటనకు దారితీసింది. ఈ కేసులో ఆనంద్ ఏడాది జైలు జీవితం గడిపి ఇటీవలే బయటికి వచ్చాడు.

సంగారెడ్డిలోనే ఉంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 9న చిన్న చెల్మెడలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంటే వెళ్ళాడు. శుక్రవారం ఉదయం బయటకు వచ్చిన ఆనంద్ ను గమనించిన ప్రవీణ్ తండ్రి అంబయ్య, తల్లి స్వరూప, సోదరుడు ప్రభుదాస్ గొడ్డళ్లతో ఆనంద్ ను గొడ్డళ్లతో వెంబడించారు. వెంట తెచ్చుకున్న కారం కళ్ళలో కొట్టారు. చిన్న చల్మెడ గ్రామ కూడలిలో తల, చేతులను నరికి వేసి.. దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు బుధేరా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సదాశివపేట గ్రామీణ సీఐ సంతోష్ కుమార్, మునిపల్లి ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి, చేరుకుని వివరాలు సేకరించారు.

‘‘నేను - నా కుమారుడు’’ ఇదే కేసీఆర్ సిద్ధాంతం... రాష్ట్రంలో అసలైన గేమ్ మొదలైంది : కిషన్ రెడ్డి

ఇదిలా ఉండగా, ఏపీలోని అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం మద్ది నాయనిపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన మహిళ ఉప్పరోళ్లపల్లికి చెందిన హేమవతిగా గుర్తించారు. ఆమె వయస్సు 45 ఏళ్లు ఉంటుందని నిర్ధారించారు. కాగా హేమవతి అన్నమయ్య జిల్లాలోని తన స్వగ్రామం నుంచి కర్ణాటక లోని చిక్బలాపూర్ జిల్లా తాటకంవారి హాళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె బి.కొత్తకోటలో నివాసమున్న తన కూతురు భవాని ఇంటికి వచ్చింది.  ఈ క్రమంలోనే ఆమె హత్యకు గురైంది. 

హేమావతిని హత్య చేసి ములకలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు ఆర్థిక సంబంధాల కారణంగానే  హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా, కుమార్తె ఇంటికి వెళ్లిన హేమలత పనిమీద ఇంటినుంచి బయటకు వెళ్లింది. ఆ తరువాత ఎంతకీ తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో నాలుగు రోజులు ఎదురు చూసిన తర్వాత ఇంటి నుంచి తిరిగి ఊరికి వెళ్లిన హేమవతి కనిపించడం లేదంటూ ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. హేమలత బీ.కొత్తకోటలో నివాసం ఉంటున్న తన కూతురు ఇంటికి తరచూ వస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో స్నేహం పెరిగింది. వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హేమలత చనిపోవడంతో ఆమె హత్యకు శ్రీకాంత్ కారణం అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  శ్రీకాంత్ ఇచ్చిన సమాచారంతో హేమవతి డెడ్బాడీని పూడ్చిపెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు.

కాగా,  శ్రీకాంత్ దగ్గర తన తల్లి చాలా కాలంగా డబ్బు దాచుకునేదని మృతురాలి కుమారుడు చెప్పాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకే తన తల్లిని శ్రీకాంత్ హత్య చేశాడని ఆరోపించాడు. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి, పిలిపించిన శ్రీకాంత్.. హత్య చేశాడని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళాడు.  హేమావతి  మిస్సింగ్ పై  కర్ణాటకలోనూ ఫిర్యాదు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?